ఎన్.ఆర్.ఐ శ్రీనివాసు వడ్లమానికి సత్కారం
- October 19, 2021
హైదరాబాద్: చార్లెట్, నార్త్ కెరోలినా, అమెరికాకు చెందిన మానవతావాది గాయకులు శ్రీనివాస్ వడ్లమాని వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్ వారు, వారి కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సాస్ వారు, వారి 95వ ప్రచురణగా ముద్రించిన 'లిటిల్ డిటెక్టివ్' నవలిక ముద్రణకు శ్రీనివాస్ వడ్లమాని, లక్ష్మీ పద్మజ వడ్లమాని సహకరించారని, లిటిల్ డిటెక్టివ్ నవలా రచయిత్రి, పూర్వ సెన్సార్ బోర్డు మెంబరు, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, తమ హర్షం ప్రకటిస్తూ 'లిటిల్ డిటెక్టివ్' నవల బహూకరిస్తూ ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా వంశీ సంస్థల అధినేత శిరోమణి, డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ, శ్రీనివాస్ వడ్లమాని మాతృభాషను, మాతృదేశాన్ని మరవకుండా తెలుగు భాషకు చేస్తున్న సేవ ప్రశంసనీయమని అన్నారు.వారు వంశీ వేగేశ్న ఫౌండేషన్ ఆశ్రమాలలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయాన్ని, షిరిడి సాయిబాబా దేవాలయాన్ని, ఘంటసాల గుడిని, దివ్యాంగుల ఆశ్రమాన్ని, సందర్శించి, వేగేశ్న ఫౌండేషన్ చెయిర్ పర్సన్, వంశీ కల్చరల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ, శైలజ సుంకరపల్లి సేవలను అభినందించారు.. స్వర్ణోత్సవాలలోకి అడుగిడుతున్న వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్, ప్రపంచ వ్యాప్తంగా ఇస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయమని శ్రీనివాస్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







