తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా దసరా సంబరాలు
- October 19, 2021
దోహా: దోహా లోని అల్ దోసారి జూ అండ్ గేమ్ రిజర్వు లో అక్టోబర్ 15వ తేదీ నాడు తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దసరా సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ మాట్లాడుతూ... కరోనా కారణంగా మినిస్ట్రీ అఫ్ పబ్లిక్ హెల్త్ నుండి వచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ మొదట కార్యక్రమం జరిగే స్థలాన్ని శానిటైజ్ చేసి మరియు మాస్క్ ధరించి, శానిటైజర్ మరియు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ విడి విడి గా పిల్లలకు మరియు కుటుంబాలకు ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణ సంప్రదాయం ఉట్టి పడేలా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.అందరూ జమ్మి ఆకును ఇచ్చి పుచ్చుకొని దసరా పండుగ జరుపుకున్నారు.పిల్లలకు మరియు పెద్దలకు ప్రత్యేక ఆటలా పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐ సి బి పి అధ్యక్షులు జియాద్ ఉస్మాన్, ప్రత్యేక అతిధిగా ఇండియన్ ఎంబసీ సెకండ్ సెక్రటరీ కుల్జీత్ సింగ్ అరోరా మరియు అతిధులు ఐ సి సి సలహా మండలి అధ్యక్షులు కే వీ ప్రసాద్,ఐ సి సి ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్, ఐ సి బి పి జనరల్ సెక్రెల్ట్రీ సబితా సాహిర్, ఐ సి సి ఉప అధ్యక్షులు సుబ్రహ్మణ్యం హెబ్బాగెలు,ఐ సి బి పి కోశాధికారి మేడం కుల్దీప్ కౌర్, ఐ సి బి పి కార్యవర్గ సభ్యులు మేడం రజని మూర్తి,ఐ సి బి పి కార్యవర్గ సభ్యులు సమీర్ వాని,ఐ సి బి పి కార్యవర్గ సభ్యులు దినేష్ గౌడ,ఐ సి సి కార్యవర్గ సభ్యులు అనీష్,క్యూ పి ఎల్ చైర్మన్ సిరాజ్ అన్సారీ,ఏ పి ఎల్ డైరెక్టర్ సయీద్,ఐ సి సి యూత్ వింగ్ కార్యవర్గ సభ్యులు శోభన్ బండారపు,ట్ జి స్ అధ్యక్షులు శంకర్ నూతనంగా ఎన్నికైన మన తెలుగు నాయకులను సన్మానించడం జరిగింది మరియు విజేతలకు బహుమతులు అందచేసారు.
ఈ కార్యక్రమములో కార్యవర్గ సభ్యులు వెంకటా సౌజన్య , స్రవంతి, మహమ్మద్ రవూఫ్ , నాగరాజు, గులాం రసూల్, నవీద్,షోయబ్, రమేష్ నేతాజీ, శివ కృష్ణ, సలావుద్దీన్,రమేష్ పిట్ల, కృష్ణ, తాహ మరియు అనీష్ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







