తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- October 20, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పలు చోట్ల ఇంకా డబుల్ డిజిట్లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,69,556కి చేరింది. కరోనా నుంచి 6,61,646 మంది కోలుకోగా మొత్తం 3,942 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,968 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో అత్యధికంగా 49 కేసులు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, మంచిర్యాల జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో వికారాబాద్, నారాయణపేట జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







