ఒమన్, బహ్రెయిన్ వాణిజ్య మంత్రుల సమావేశం

- October 21, 2021 , by Maagulf
ఒమన్, బహ్రెయిన్ వాణిజ్య మంత్రుల సమావేశం

మనామా: బహ్రెయిన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ జాయెద్ రషీద్ అల్ జయానీతో  ఒమన్ వాణిజ్య, పరిశ్రమ ల మంత్రి కైస్ మహ్మద్ అల్ యూసఫ్ సమావేశమయ్యారు. మనామాలో జరుగుతున్న జీసీసీ వాణిజ్య, పరిశ్రమల మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈ రెండు దేశాల మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒమన్, బహ్రెయిన్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బహ్రెయిన్ లో ని  ఒమన్ రాయబారి మహ్మద్ అలీ అల్ బలుషి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.  వ్యాపార సంబంధాలు, ప్రోత్సహకాలపై  సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చించారు.  రెండు దేశాల పెట్టుబడులకు సంబంధించి ఆసక్తి గా ఉన్న వ్యాపారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com