శరవేగంగా హైదరాబాద్ విమానాశ్రయ ఎయిర్ సైడ్‌ విస్తరణ

- October 21, 2021 , by Maagulf
శరవేగంగా హైదరాబాద్ విమానాశ్రయ ఎయిర్ సైడ్‌ విస్తరణ
  • విమానయాన పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తూ, భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) 2008లో ప్రారంభించబడింది. దేశంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో ఇదే మొదటిది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా విమానాశ్రయ డెవలపర్‌గా  GMR గ్రూప్‌ మొదటిసారిగా విమానయాన పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ విమానాశ్రయాన్ని మొదట ఏడాదికి 12 మిలియన్ల ప్రయాణీకుల కోసం రూపొందించారు. 
  • దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో విమానయానం ఒకటి. ప్రయాణీకుల రద్దీపరంగా విమానయాన మార్కెట్ చాలా వృద్ధిని సాధించింది. విమానయాన రంగంలో పెరుగుతున్న డిమాండ్‌తో, భారతదేశ దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాలలో ఒకటిగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి FY'19 లో 21 మిలియన్ల మంది ప్రయాణీకుల రాకపోకలు జరిగాయి. FY’15-FY’19 మధ్య కాలంలో 4 సంవత్సరాల CAGR ~ 20% తో ప్రయాణీకుల సంఖ్య విషయంలో హైదరాబాద్ విమానాశ్రయం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది.
  • పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని తట్టుకోవడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 34 మిలియన్ల మందికి(MPPA) మించిన ప్రయాణీకులను హ్యాండిల్ చేయడానికి భారీ విస్తరణ కార్యకలాపాలను చేపట్టింది. కొత్త రూట్లు, మెరుగైన కనెక్టివిటీ, ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల, కొత్త రన్‌వే స్లాట్‌ల డిమాండ్ కూడా ఎయిర్‌పోర్ట్ విస్తరణలో ప్రధాన పాత్ర పోషించాయి. 
  • విస్తరణ ప్రాజెక్టులో పునరుద్ధరించబడిన టెర్మినల్‌తో పాటు, ఎయిర్‌సైడ్, సిటీ సైడ్ ప్రాంతాలు  రెండింటిని విస్తరిస్తున్నారు. విస్తరణ తర్వాత, ఎయిర్‌సైడ్‌లో 93 కోడ్- C ఎయిర్‌క్రాఫ్ట్ స్టాండ్‌లు ఉంటాయి. (44 కాంటాక్ట్, 49 రిమోట్ స్టాండ్‌లు)
  • విస్తరణ కార్యకలాపాలలో భాగంగా ఈ క్రింది అదనపు ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్‌ను జోడిస్తున్నారు :
  • అంతర్జాతీయ విమాన కార్యకలాపాల అవసరాలను తీరుస్తున్న వెస్టర్న ఏప్రన్ విస్తరణ అనంతరం సుమారు 57,500 చదరపు మీటర్లు ఉంటుంది. ఇక్కడ అదనంగా 17 కాంటాక్ట్ స్టాండులు (కోడ్- C) మరియు ఒక రిమోట్ స్టాండ్ (కోడ్- C) వస్తాయి.
  • జాతీయ విమాన కార్యకలాపాలకు ఉపయోగపడే తూర్పు ఏప్రన్ విస్తరణ అనంతరం సుమారు 25,500 చదరపు మీటర్లు ఉంటుంది. ఇక్కడ అదనంగా 17 కాంటాక్ట్ స్టాండులు (కోడ్- C) మరియు నాలుగు రిమోట్ స్టాండులు (కోడ్- C) వస్తాయి.
  • అత్యంత తూర్పు భాగాన ఉన్న నూతన రిమోట్ ఏప్రన్ 1,26,200 చదరపు మీటర్లు ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే 42 రిమోట్ స్టాండులు (కోడ్- C)లను ఉపయోగించుకుంటున్నారు.  
  • విమానాల రాకపోకల సమయంలో సురక్షితమైన కార్యకలాపాలు, ఎలాంటి ఆటంకాలూ లేని బ్యాగేజ్, ప్రయాణీకులు, గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్‌మెంట్ (GSE) వాహనాల రాకపోకల కోసం సమయాన్ని ఆదా చేయడానికి ఒక నూతన సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. 
  • రన్‌వే సామర్థ్యాన్ని, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇటీవల 4 కొత్త ర్యాపిడ్ ఎగ్జిట్ టాక్సీవేలను  ప్రారంభించారు. ఈ రాపిడ్ ఎగ్జిట్ టాక్సీవేల వల్ల విమానాలు తక్కువ దూరంలోనే రన్‌వే నుండి ట్యాక్సీ ఆఫ్ (గాలిలోకి ఎగిరి) అయి, తద్వారా రన్‌వే ఆక్యుపెన్సీ సమయం తగ్గి, రన్‌వే సామర్థ్యం పెరుగుతుంది.
  • సెకెండరీ రన్ వే ఉపయోగించేటప్పుడు కార్యకలాపాలు సక్రమంగా సాగేందుకు ఒక నూతన ప్యారలల్ ట్యాక్సీ వేను నిర్మించడం జరిగింది.

సుస్థిరత్వ దిశగా ఇటీవల ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి వేగంగా నిష్క్రమించి తద్వారా ఇంధన పొదుపు, కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం నూతన టాక్సీవేలు, ప్యారలల్ టాక్సీవేలను ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలతో అనుసంధానించారు. ఎయిర్‌ఫీల్డ్‌లో LED లు, అడ్వాన్స్‌డ్ ఎయిర్‌ఫీల్డ్ లైటింగ్ కంట్రోల్ మరియు పర్యవేక్షణ వ్యవస్థ (ALCMS), ఇండివిడ్యువల్ లాంప్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్(ILCMS) లాంటి కేటగిరీ-II ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ సిస్టమ్ లను ఉపయోగిస్తున్నారు. 

సురక్షితమైన నీటి పారుదల కోసం ఎయిర్‌సైడ్‌లో 16 లక్షల చదరపు మీటర్ల ప్రాంతాన్ని చదును చేసారు. ఇది వర్షాకాలంలో వాన నీరు సాఫీగా ప్రవహించడంలో సహాయపడుతుంది. వాన నీటి పారుదల వ్యవస్థ, ఎయిర్‌ఫీల్డ్ నుండి వచ్చే నీటిని 450 MLD సామర్థ్యం గల రిజర్వాయర్‌లో సేకరించి నిల్వ చేసే విధంగా రూపొందించబడింది. ఈ నీటిని శుద్ధి చేసి తిరిగి గృహ, నీటిపారుదల కోసం ఉపయోగించుకుంటారు. ఇది నీటి సంరక్షణలో సహాయపడడమే కాకుండా, వాటర్ బోర్డు నీటి సరఫరాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

2008లో విమానాశ్రయం ప్రారంభమైనప్పుడు, దేశంలో విమానాశ్రయ రంగానికి సంబంధించిన అనేక తొలి సాంకేతిక ఆవిష్కరణలకు ఈ విమానాశ్రయం నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మరియు సెంట్రలైజ్డ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (AOCC), ప్రయాణీకుల ఆధునిక సమాచార వ్యవస్థలు ఇక్కడున్నాయి. కొన్నేళ్లుగా GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు సురక్షితమైన కాంటాక్ట్-లెస్ అనుభవాన్ని అందించడానికి నూతన టెక్నాలజీ ఆధారిత మార్గాలను అన్వేషించడంలో ముందుంది. విమానాశ్రయంలో భద్రత, మెరుగైన ప్రయాణీకుల అనుభవం, సమర్థవంతమైన కార్యకలాపాల కోసం టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ కనుగొనడంలో హైదరాబాద్ విమానాశ్రయం ముందుంది.

  • దేశీయ, అంతర్జాతీయ యాత్రికులకు పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సౌకర్యం కలిగిన ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ కాంటాక్ట్‌లెస్ ఈ-బోర్డింగ్ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలూ లేనిది. బోర్డింగ్ కార్డుల మాన్యువల్ స్టాంపింగ్ అవసరాన్ని ఇది పూర్తిగా తొలగిస్తుంది. విమానాశ్రయంలో అన్ని కీలక ప్రక్రియలలో ఇది ఉపయోగపడుతుంది. తాజాగా, హైదరాబాద్ విమానాశ్రయం వివిధ టచ్‌పాయింట్లలో ఆర్టిఫిషియల్ బేస్డ్ క్యూ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌ను ఉపయోగించుకుంటోంది. సిస్టమ్ సెక్యూరిటీ కెమెరాలు, వీడియో అనలిటిక్స్‌ని మిళితం చేసిన ఈ వినూత్న క్యూ మేనేజ్‌మెంట్ ప్రయాణికులు వేచి ఉండాల్సిన సమయాన్ని తెలియజేయడం, సామాజిక దూర పర్యవేక్షణ వంటి వివిధ కీలక అంశాలను పర్యవేక్షిస్తుంది. అధునాతన వీడియో అనలిటిక్స్ ప్లాట్‌ఫాం వివిధ కెమెరాల నుండి వీడియో ఫీడ్‌ని విశ్లేషించి, ఒక నిర్దిష్ట సమయంలో ప్రయాణీకుల గణాంకాలను ఖచ్చితంగా అంచనా వేస్తుంది.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com