ఒమన్ పై స్కాట్లాండ్ విజయం...

- October 21, 2021 , by Maagulf
ఒమన్ పై స్కాట్లాండ్ విజయం...

ఒమన్: టీ20 వరల్డ్‌కప్ 2021: ఓమన్‌పై 8 వికెట్ల తేడాతో సునాయస విజయం అందుకున్న స్కాట్లాండ్... గ్రూప్ బీ నుంచి టేబుల్ టాపర్‌గా సూపర్ 12 రౌండ్‌కి స్కాట్లాండ్.క్వాలిఫైయర్స్‌లో గ్రూప్ బీ నుంచి సూపర్ 12కి చేరే జట్లు కన్ఫార్మ్ అయిపోయాయి. ఓమన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకున్న స్కాట్లాండ్, బంగ్లాదేశ్‌తో కలిసి సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించింది.

123 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన స్కాట్లాండ్ జట్టుకి ఓపెనర్లు 33 పరుగుల భాగస్వామ్యం అందించారు. 19 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన జార్జ్ మున్సే, ఫయాజ్ భట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ కేల్ కోట్జర్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసి అవుట్ కాగా... మాథ్యూ క్రాస్, రిచీ బెర్రింగ్టన్ కలిసి మ్యాచ్‌ను ముగించేశారు.

క్రాస్ 35 బంతుల్లో బౌండరీలేమీ లేకుండా 26 పరుగులు చేయగా, రిచీ 21 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించారు... ఈ మ్యాచ్‌లో  ఓమన్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన స్కాట్లాండ్, గ్రూప్ స్టేజ్‌లో మూడుకి మూడు విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా నిలిచింది.

గ్రూప్ బీ నుంచి టేబుల్ టాపర్‌గా నిలిచిన స్కాట్లాండ్ జట్టు గ్రూప్ 2లో ఉన్న ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘాన్‌లతో కలిసి మ్యాచులు ఆడుతుంది. గ్రూప్ బీ నుంచి సూపర్ 12కి వచ్చిన బంగ్లాదేశ్ జట్టు, గ్రూప్ 1లో ఉన్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌తో కలిసి మ్యాచులు ఆడుతుంది.

గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే శ్రీలంక జట్టు ఇప్పటికే సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించగా మరో జట్టు ఏదో రేపు జరిగే మ్యాచులతో తేలిపోనుంది. ఐర్లాండ్, నమీబియా రెండు మ్యాచుల్లో చెరో విజయం సాధించాయి. అక్టోబర్ 22న జరిగే మ్యాచుల్లో ఐర్లాండ్ జట్టు,నమీబియాతో... శ్రీలంక జట్టు, నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడబోతున్నాయి. ఐర్లాండ్, నమీబియా మ్యాచ్‌లో గెలిచే జట్టు సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తుంది.

స్కాట్లాండ్ సూపర్ 12 రౌండ్‌లో అక్టోబర్ 25న ఆఫ్ఘాన్, 27న గ్రూప్ ఏ నుంచి వచ్చే జట్టుతో, నవంబర్ 3న న్యూజిలాండ్‌తో, నవంబర్ 5న భారత్ తో, నవంబర్ 7న పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడుతుంది. అలాగే బంగ్లాదేశ్, అక్టోబర్ 24న శ్రీలంకతో, 27న ఇంగ్లాండ్‌తో, 29న వెస్టిండీస్‌తో, నవంబర్ 2న సౌతాఫ్రికాతో, నవంబర్ 4న ఆస్ట్రేలియాతో మ్యాచులు ఆడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com