20 కార్యాలయాలు సీజ్.. 60 మంది అరెస్ట్

- October 21, 2021 , by Maagulf
20 కార్యాలయాలు సీజ్.. 60 మంది అరెస్ట్

కువైట్: రెసిడెన్స్ చట్టం ఉల్లంఘనుల్ని గుర్తించడం అలాగే, ఫేక్ డొమెస్టిక్ వర్కర్ల నియామకం కోసం ఏర్పాటైన కార్యాలయాలను గుర్తించడం కోసం నిర్వహించిన తనిఖీల్లో 60 మంది అరెస్టయ్యారు. 20 కార్యాలయాల్ని సీజ్ చేశారు. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ మరియు సెక్యూరిటీ మీడియా (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) వెల్లడించింది. తప్పించుకు పారిపోయిన డొమెస్టిక్ వర్కర్లకు ఈ కార్యాలయాలు తాత్కాలికంగా పని కల్పిస్తున్నాయి. స్పాన్సర్స్ నుంచి పారిపోయే కార్మికులకు ఈ ఫేక్ కార్యాలయాలు సహకరిస్తున్నాయి. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం 20 ఫేక్ డొమెస్టిక్ వర్కర్ల కార్యాలయాల్ని సీజ్ చేయడంతో పాటు, 60 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com