ట్రాఫిక్ వాయిలేషన్స్ నివారణకు సీసీకెమెరాల ఏర్పాటు
- November 01, 2021
ఖతార్: ఖతార్ లో ట్రాఫిక్ ఉల్లంఘనుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, స్మార్ట్ ఫోన్లను డ్రైవింగ్ లోనే వినియోగించటం సాధారణమైపోయింది. దీంతో ట్రాఫిక్ కు చాలా ఇబ్బంది అవుతోంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సమస్య ఎక్కువ కావటంతో ఇంటిరీయర్ మినిస్ట్రీ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ ఈ అంశంపై దృష్టి పెట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని పక్కా ఆధారాలతో పట్టుకునేందుకు సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరు నెలల క్రితమే రోడ్లకు ఇరు వైపుల, ప్రధాన కూడళ్లలో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ డైరెక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఈ కెమెరాలను పలు చోట్ల ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవింగ్ చేస్తూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ఓ మహిళను కూడా సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళన కలిగిస్తోంది
డ్రైవింగ్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య పెరిగిపోతుందని ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ కల్నల్ మహమ్మద్ రాడి అల్ హజ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది డ్రైవింగ్ లోనూ, ఇళ్లలో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలో ఎక్కువ సీటు బెల్ట్ ధరించకపోవటం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడటం కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. సీసీకెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై స్పష్టమైన పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







