APNRTS కువైట్ టీం వారి సహకారంతో స్వస్థలానికి చేరిన ఏపీ మహిళ
- November 05, 2021
కువైట్:ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఉబ్బా దుర్గా,అనే మహిళ కువైట్ దేశంలో కువైటీ ఇంట్లో పని చేస్తూ అనివార్య కారణాల వల్ల బయటకు వచ్చేసి, బయట పని చేసుకుంటూ ఉన్న సమయంలో కాలుకు, దెబ్బ తగిలి నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమె, కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించి, తనను భారత్ కు తిరిగి పంపాలని కోరింది.
ఈ విషయం తెలుసుకున్న APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్, వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆదేశాల మేరకు,APNRTS రీజనల్ కో-ఆర్డినేటర్ నాయని మహేశ్వర రెడ్డి, కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారుల సహాయ సహకారాలతో పేపర్ వర్క్ అంత పూర్తి చేసి ఉబ్బా దుర్గ ను ఇండియాకు తిరిగి పంపడం జరిగింది.
ఈ సందర్భముగా ఉబ్బా దుర్గ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి, ఏపిఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్, సీఈఓ దినేష్ కుమార్,APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్, వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, నాయని మహేశ్వర్ రెడ్డి, మరియు ఆర్థికంగా ఆదుకొని, 3నెలల పాటు వసతి ఏర్పాటు చేసిన వైఎస్సార్సిపీ నాయకులు N.V సుబ్బారెడ్డి, భారత రాయబార కార్యాలయం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
APNRTS చైర్మన్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ ఇలియాస్ మాట్లాడుతూ...కువైట్ లోని APNRTS సభ్యులు చేస్తున్నసేవలకు హర్షం వ్యక్తం చేస్తూ, ముమ్మడి బాలిరెడ్డి, నాయని మహేశ్వర్ రెడ్డి, N.V సుబ్బారెడ్డి కి అభినందిస్తూ,భారత రాయబార కార్యాలయ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
_1636100978.jpg)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







