నిరుద్యోగులకు హెచ్‌సీఎల్ శుభవార్త ..
- November 06, 2021
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
కొత్తగా 10వేల మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు టెక్ సంస్థలు క్లౌడ్ (Cloud) లోకి మారేందుకు సిద్ధమవుతుండగా..హెచ్‌సీఎల్ సైతం తన క్లౌడ్ సేవల కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్ (AWS)ను ప్రారంభించింది. ఇప్పటికే, ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీ కోసం దాదాపు 10 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 20,000 మందికి పైగా నిపుణులకు పెంచాలని యోచిస్తోంది. తద్వారా, తన ఏడబ్బ్యూఎస్ సేవల కోసం కొత్తగా మరో 10 వేల మందిని నియమించుకోనుంది. ఈ ప్రత్యేక బిజినెస్ యూనిట్ కోసం ఏడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్, సొల్యూషన్స్, బిజినెస్ టీమ్లు సహకరిస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, హెచ్‌సీఎల్ ప్రస్తుతం ఎడబ్బ్యూఎస్ ప్రీమియర్ కన్సల్టింగ్ పార్ట్నర్ గా పనిచేస్తోంది. ఇది కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించేందుకు, ఎండ్ టు ఎండ్ రోడ్ మ్యాప్‌ను అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఏడబ్యూఎస్ సర్వీసులు మౌలిక సదుపాయాలు, అప్లికేషన్లు, డేటాను ఆధునీకరించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు, వ్యాపారాల్లో భవిష్యత్తు టెక్నాలజీని వినియోగంలో తీసుకొచ్చేందుకు సహకరిస్తుంది. ఏడబ్ల్యూఎస్ బీయూ అనేది తమ కంపెనీ క్లౌడ్ స్మార్ట్ స్ట్రాటజీలో భాగమని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కల్యాణ్ కుమార్ అన్నారు. కస్టమర్లకు బలమైన క్లౌడ్ వ్యవస్థ నిర్మాణం, ప్రతి కోణంలో సేవలు అందించే దిశగా పనిచేస్తున్నమని తెలిపారు.
ఈ ఏడాది 22 వేల మంది ఫ్రెషర్ల నియామకం..హెచ్‌సీఎల్ ఇప్పటికే క్లౌడ్ ఆధారిక సేవలు అందిస్తోంది. క్లౌడ్-ఫోకస్డ్ ఎకోసిస్టమ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్ స్ట్రాటజీతో కూడిన గ్లోబల్ సిస్టమ్స్ ఇంటిగ్రేటర్ (GSI), ఇండిపెండెంట్ సాఫ్ట్‌వేర్ వెండర్ (ISV) వంటి సంస్థలకు హెచ్‌సిఎల్ క్లౌడ్ సేవలు అందిస్తోంది. అయితే, ఇప్పుడు కొత్త నియామకాల ద్వారా ఏడబ్ల్యూఎస్ సేవలను మరింత విస్తరించనుంది. కాగా, ఏడబ్ల్యూఎస్ యూనిట్ సేవలను విస్తృతం చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపర్చాలని చేయాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 22,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని హెచ్‌సీఎల్ ఇటీవలే ప్రకటించింది. వీరిలో కేవలం ఏడబ్ల్యూఎస్ కోసమే 10 వేల మందిని నియమించుకోనుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







