న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 250 ఉద్యోగాలు.. వివరాలివే

- November 07, 2021 , by Maagulf
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 250 ఉద్యోగాలు.. వివరాలివే
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే అక్టోబర్ 28 నుంచి ప్రారంభమైంది. ఎంపికైన అభ్యర్థులు మహారాష్ట్ర లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు.
 
ఖాళీల వివరాలు..
సంబంధిత విభాగంలో ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. పోస్టులు, ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టు                  ఖాళీలు
టర్నర్(Turner) 10
ఎలక్ట్రీషియన్(Electrician) 28
వెల్డర్(Welder) 21
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (Electronics mechanic) 15
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్(Instrument mechanic) 13
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్(Refrigeration and AC mechanic) 16
కార్పెంటర్(Carpenter) 14
ప్లంబర్(Plumber) 15
వైర్ మెన్(Wireman) 11
డీజిల్ మెకానిక్(Diesel mechanic) 11
మెషినిస్ట్ (Machinist) 11
పెయింటర్(Painter) 15
డ్రాట్స్‌మెన్‌ మెకానికల్(Draughtsman mechanical) 2
డ్రాట్స్‌మెన్‌ సివిల్(Draughtsman civil) 1
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టెమ్ మెయింటెన్స్ (Information and communication technology system maintenance) 17
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (Computer operator and programming assistant) 14
స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)-Stenographer (English) 2
స్టోనోగ్రాఫర్(హిందీ)-Stenographer (Hindi) 1
సెక్రటేరీయల్ అసిస్టెంట్-Secretarial Assistant 4
హౌజ్ కీపర్-House Keeper Institution 3
 
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ గా పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
- అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
-అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ ను చూడొచ్చు.
 
దరఖాస్తు: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా Ministry of Skill Development and Entrepreneurship పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం NPCIL అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు నవంబర్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com