ప్రవాస భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా ‘ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ మీట్’..
- November 12, 2021
ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఇండో- అరబ్ కాన్ఫెడరేషన్ కౌన్సిల్ (IACC)’ డిసెంబర్ 4న బెంగళూరులో సమావేశం కానుంది. ‘ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ మీట్’ పేరుతో జరిగే ఈ సమావేవాన్ని గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి రామ్‌థాస్ అథవాలే అధ్యక్షత వహించనున్నారు.వివిధ రాష్ట్రాల మంత్రులు, దౌత్యవేత్తలు, విదేశాల్లో స్థిరపడిన భారతీయ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.1980లో కేరళలోని కోజికోడ్ కేంద్రంగా ఏర్పాటైన IACC అసోసియేషన్ ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.2014 ఛారిటబుల్ ట్రస్ట్‌గా మారిన ఈ అసోసియేషన్‌కు దిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు అమెరికా, బ్రిటన్, అరబ్ దేశాల్లో శాఖలున్నాయి.
NRI లను ప్రోత్సహించేలా…ఈ సందర్భంగా కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి అట్టక్కోయ పల్లిక్కండి బెంగళూరులో జరిగే ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ మీట్ వివరాలను వెల్లడించారు. ‘ కరోనా ప్రభావంతో IACC అసోసియేషన్ సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు వచ్చే నెలలో ఎన్‌ఆర్‌ఐ మీట్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు కనుగొనడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇండియాకు తిరిగొచ్చిన ఎన్‌ఆర్‌ఐలకు గృహనిర్మాణాలు, పునరావాసం కల్పించడంపై కార్యాచరణ ప్రకటిస్తాం. అదేవిధంగా భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తాం. దీంతో పాటు వివిధ రంగాల్లో సృజనాత్మకతను చాటుకుంటోన్న ఎన్‌ఆర్‌ఐలను ఘనంగా సన్మానిస్తాం’ అని పల్లిక్కండి తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







