జర్నలిస్ట్లకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- November 12, 2021
హైదరాబాద్: జర్నలిస్ట్ పాస్‌లు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శుభవార్త తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గుడ్ న్యూస్ ఫర్ అవర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఆర్టీసీ నుంచి వ్యాలీడ్ బస్‌పాస్ కలిగి ఉన్న జర్నలిస్టులు ఇకపై తమ టికెట్లపై రాయితీని ఆన్‌లైన్‌లోనే పొందవచ్చని ఆయన తెలిపారు. టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా జర్నలిస్టులు తమ కన్సెషన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. గతంలో జర్నలిస్టులు తమ టికెట్లపై రాయితీని ఆన్‌లైన్‌లో పొందే వెసులుబాటు లేదు. నేరుగా బస్ కండక్టర్ నుంచి మాత్రమే రాయితీ టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. జర్నలిస్టులకు ఆన్‌లైన్‌లో టికెట్ల విషయమై సలహా ఇచ్చిన డీ అభినయ్, ఎన్‌వీ నాగార్జునకు కృతజ్ఞతలు అని సజ్జనార్ తన ట్వీట్ చివరలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







