వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రతలు..!
- March 21, 2016
ఎండాకాలం వచ్చిందంటే వాతావరణం వేడెక్కుతుంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతారు. శరీరంలో సాధారణంగా ఉండే శక్తి కూడా తగ్గుతుంది. సూర్య కిరణాల తాకిడికి చర్మాన్ని కాలిపోయేలా చేసి చర్మంలోని తేమను పోగొడతాయి. వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. అందులో కొన్ని.. - పుచ్చకాయ, బొప్పాయి తప్పకుండా తినాలి.- పొద్దున్నే బాగా నీరు తీసుకుని తర్వాత వ్యాయామం చేస్తే మీరు ఎంతో ఫ్రెష్ గా ఉంటారు. - ప్రయాణానికి బయల్దేరే ముందు బాగా నీరు తీసుకోవాలి. తడిగా ఉన్న నాప్కిన్స్ వెంట తీసుకువెళ్ళాలి. అప్పుడు వాటితో తుడుచుకుంటే ఎంతో మంచిది. - భోజనానికి ఉపక్రమించే ముందు తగినంత నీరు తీసుకోవాలి. తద్వారా భోజన సమయంలో తరచుగా దాహానికి గురి అవ్వరు. ఒకవేళ భోజనం తర్వాత నీటిని తీసుకునేట్లయితే కనీసం ఒక గంట అయినా సమయాన్ని తీసుకోవాలి. - మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ ను వెంట తీసుకు వెల్లాలి. అదీ ప్రయాణాలలో వాటర్ బాటిల్ ను ఉంచుకోవటం ఎంతో మంచిది. వనీల, మాంగో, ఆరంజ్ లాంటి ఫ్లావర్స్ కలిపి వాడితే దప్పిక ఎక్కువై తరచుగా నీటిని తీసుకునే అవకాశం ఉంది. - స్పోర్ట్స్ డ్రింక్స్ వాడడం వల్ల డీ హైడ్రేషన్ నుంచి బయటపడతారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







