విదేశీ విమానాల రాకపోకలకు అనువైనది... విజయవాడ విమానాశ్రయం..

- March 21, 2016 , by Maagulf
విదేశీ విమానాల రాకపోకలకు అనువైనది... విజయవాడ విమానాశ్రయం..

విదేశీ విమానాల రాకపోకలకు అనువైనది... విజయవాడ విమానాశ్రయం .... ఈ విషయాన్ని ప్రపంచానికి చాటాలని కేంద్ర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం ఓ వేదికగా ఈ నెల 26న విశాఖలో ఎయిర్‌ ట్రావెల్‌ అసోసియేషన్‌ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయానికి అలాంటి సత్తా ఉన్నదని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు ఈ కాన్ఫరెన్స్‌లో ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. దీనికి ముందుగా నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ ఫెడరేషన్‌ (ఏపీసీసీఐఎఫ్‌) ప్రతినిధులతో వచ్చే మంగళవారం సమావేశం అవుతారు. ఛాంబర్‌ ప్రతినిధుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని సమర్ధవంతమైన ప్రజంటేషన్‌ను ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు చొరవతో జరిగే ఈ ఎయిర్‌ట్రావెల్‌ అసోసియేషన్‌ కాన్ఫరెన్స్‌కు తిరుపతి, విజయవాడ, విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టు డైరెక్టర్లకు ఆహ్వానం అందింది. స్వదేశీ, విదేశీ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్‌కు వస్తున్నారు. నాలుగు విమానాశ్రయాల ఎయిర్‌పోర్టు డైరెక్టర్లు తమ దగ్గర ఉన్న అవకాశాలు, సమర్ధత గురించి ప్రజంటేషన్‌ ఇస్తారు.విదేశీ విమానాల రాకపోకలకు అనువైనది... విజయవాడ ఎయిర్ పోర్ట్.... ఈ విషయాన్ని ప్రపంచానికి చాటాలని కేంద్ర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం ఓ వేదికగా ఈ నెల 26న విశాఖలో ఎయిర్‌ ట్రావెల్‌ అసోసియేషన్‌ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయానికి అలాంటి సత్తా ఉన్నదని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు ఈ కాన్ఫరెన్స్‌లో ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. దీనికి ముందుగా నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ ఫెడరేషన్‌ (ఏపీసీసీఐఎఫ్‌) ప్రతినిధులతో వచ్చే మంగళవారం సమావేశం అవుతారు. ఛాంబర్‌ ప్రతినిధుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని సమర్ధవంతమైన ప్రజంటేషన్‌ను ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు చొరవతో జరిగే ఈ ఎయిర్‌ట్రావెల్‌ అసోసియేషన్‌ కాన్ఫరెన్స్‌కు తిరుపతి, విజయవాడ, విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టు డైరెక్టర్లకు ఆహ్వానం అందింది. స్వదేశీ, విదేశీ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్‌కు వస్తున్నారు. నాలుగు విమానాశ్రయాల ఎయిర్‌పోర్టు డైరెక్టర్లు తమ దగ్గర ఉన్న అవకాశాలు, సమర్ధత గురించి ప్రజంటేషన్‌ ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com