"భారత్ మాతాకి జై" ఎందుకంటే: -

మనిషిని, గొడ్డుని వేరు చేసేది భావోద్వేగం. "భారత్ మాతా కి జై" అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం. పోరాట స్ఫూర్తి, ఐకమత్యం, సౌభ్రాతృత్వం అన్నీ భావోద్వేగాల్లోంచే వస్తాయి. అదే లేకపోతే స్వాతంత్రపోరాటమే లేదు. భావోద్వేగానికి లాజిక్ ఉండదు. ఉండాల్సిన అవసరం లేదు. "భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరసోదరీమణులు" అని స్కూల్లో చెప్పే ప్లెడ్జ్ లో కూడా లాజిక్ వెతికి "అందరూ సోదర సోదరీమణులు ఎలా అవుతారు? అర్థం లేకుండా!" అంటే అలా అన్నవాడిలో భావోద్వేగ నరం పనిచేయడం లేదని అర్థం. ఇంతకీ ఆ ప్లెడ్జ్ రాసింది ఒక తెలుగు వాడు. పేరు పైడిమర్రి వేంకట సుబ్బారావు. ఆయన తెలుగులో వ్రాస్తే అది దేశమంతా అన్ని భాషల్లోనూ చెప్తున్నారిపుడు. ఇలా తెలుగువాడు అని చెప్పుకోవడంలో కూడా భావోద్వేగం ఉంది. అదేదో సినిమా డయలాగ్ లాగ మూడు సింహాల చిహ్నం చూసినప్పుడల్లా నాకు ఇలా అనిపిస్తుంది.

"అశోక చిహ్నంలో
కనిపించని
నాలుగో సింహం-
భరతమాత వాహనం".

ఇలా అనుకోవడంలో కూడా నామటుకు నాకు భావోద్వేగం ఉంది.

-సిరాశ్రీ.

Back to Top