ఫార్ములా వన్ వీకెండ్: ఫాన్ జోన్ కార్యక్రమాల వెల్లడి
- November 18, 2021
దోహా: ఫార్ములా వన్ ఓరెడూ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2021 3 ఫ్యాన్ జోన్లలో వినోద కార్యక్రమాల వివరాల్ని వెల్లడించింది. వీకెండ్ నేపథ్యంలో టిక్కెట్లు కలిగిన అభిమానుల కోసం ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారు. లోసైల్ సర్క్యూట్ స్పోర్ట్స్ క్లబ్ గేట్లు రేపు ఉదయం 10.30 నిమిషాలకు తెరచుకుంటాయి. ఫాన్ జోన్ వన్‌లో ఆగ్యుమెంటెడ్ రియాలిటీ రేస్ కార్ యాప్‌ని తమ మొబైల్ ఫోన్ల ద్వారా అలాగే వీఆర్ మరియు మోషన్ సిమ్యులేటర్స్ ద్వారా ఎంజాయ్ చేయొచ్చు. రిమోట్ కం్టరోల్ రేస్ ట్రాక్ కూడా వుంది. డ్రైవర్ ఫొటో వాల్ వద్ద ఫొటోలు దిగొచ్చు. విన్నర్ పోడియం వద్ద ఫొటోలు దిగేందుకు అవకాశముంది. ఫాన్ జోన్ రెండు విషయానికొస్తే, ఫొటో కాల్ సెషన్లను ‘డ్రైవర్ ఫొటో వాల్’ వద్ద అనుభూతి చెందవచ్చు. విన్నర్ పోడియం వద్ద ఎఫ్1 సిమ్యులేటర్స్ అలాగే రిమోట్ కంట్రోల్ రేస్ ట్రాక్ వద్ద ఫొటోలు దిగేందుకు వీలుంది. ఫాన్ జోన్ 3 విషయానికొస్తే, రెండో జోన్ తరహాలోనే ఇక్కడా అవకశాలు కల్పిస్తున్నారు. రెడ్ బుల్ మోటో స్టంట్ షో అలాగే లైవ్ డీజే వుంటాయి. ఫుడ్ కోర్టుల్ని అన్ని జోన్లలో ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు లైవ్ ఎయిర్ షో తిలకించొచ్చు. మెట్రో మరియు షటిల్ సర్వీసులు ఏర్పాటు చేశారు. కోవిడ్ 19 నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. వ్యాక్సినేషన్ పొంది ఎహ్తెరాజ్ యాప్ ద్వారా గ్లోడెన్ ఫ్రేమ్ చూపాలి.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







