చైనా దూకుడు.. అరుణాచల్‌లో 60 బిల్డింగ్‌ల నిర్మాణం.. కొత్త శాటిలైట్ చిత్రాలివే
- November 18, 2021
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో అక్రమంగా చైనా నిర్మించిన రెండవ గ్రామానికి చెందిన తాజా శాటిలైట్ దృశ్యాలను ఓ జాతీయ మీడియా రిలీజ్ చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 బిల్డింగ్‌లను నిర్మించినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టమవుతున్నది. 2019 శాటిలైట్ దృశ్యాల్లో లేని ఆ గ్రామం.. ఏడాది తర్వాత తీసిన చిత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల అరుణాచల్‌లో ఓ గ్రామం నిర్మించిన చైనా.. దానికి 93 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఈ కొత్త ప్రాంతాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇంటర్నేషన్ బోర్డర్ మధ్య ఉన్న భారత భూభాగంలో సెకండ్ ఎన్‌క్లేవ్‌ను నిర్మించినట్లు భావిస్తున్నారు. ఆ ప్రాంతం తమదే అని భారత్ గతంలో పేర్కొన్నది. అయితే కొత్తగా నిర్మించిన ఆ బిల్డింగ్‌ల్లో ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియరావడం లేదు. భారతీయ ఆర్మీ దీనిపై స్పందిస్తూ .. కొత్త నిర్మాణం ఎల్ఏసీకి ఉత్తరం వైపున ఉన్నట్లు పేర్కొన్నది. అరుణాచల్ ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో ఉన్న భూభాగంలో ఈ ప్రాంతం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







