బహ్రెయిన్ గ్రాండ్ పిక్స్‌కి కౌంట్ డౌన్
- March 22, 2016
2016 ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ పిక్స్ వైపు ప్రపంచం దృష్టి సారించింది. మార్చ్ 31న ప్రారంభమయ్యే ఈ ఫెస్టివ్ కోసం అప్పుడే హంగామా మొదలైంది. పది రోజుల ముందు నుంచే ఫార్ములా వన్ గ్రాండ్ పిక్స్ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చ్ 31న మొరాకో ఆర్టిస్ట్ సాద్ లమ్జార్డ్ కాన్సెర్ట్ జరుగుతుంది. ఆహూతుల్ని అలరించేందుకు ఈ అరబిక్ మ్యూజిక్ స్టార్ పలు హిట్ ఆల్బమ్స్‌తో సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 1న రెగ్గాయ్ లెజెండ్ జిమ్మీ క్లిఫ్, విల్ సూపర్ స్టార్ డిజెస్ ఆగ్వ్ఎల్ ఇంగ్రాసో కాన్సెర్ట్, ఏప్రిల్ 2న ఆర్టిస్ట్ మరియు ప్రొడ్యూసర్ అవిసి ఆహతుల్ని అలరిస్తారు. మెయిన్ గ్రాండ్ స్టాండ్ టిక్కెట్ ధరని 150 బహ్రెయినీ దినార్స్‌గా నిర్ణయించారు. బాటెల్కో గ్రాండ్ స్టాండ్ టిక్కెట్ ధర 120 బహ్రెయినీ దినార్స్. టర్న్ వన్ గ్రాండ్ స్టాండ్ 100 బహ్రెయినీ దినార్స్, యూనివర్సిటీ అండ్ విక్టరీ గ్రాండ్ స్టాండ్స్ టిక్కెట్ ధర 60 బహ్రెయినీ దినార్స్. 12 ఏళ్ళ లోపు 3 ఏళ్ళ పైన వయసున్నవారికి సగం ధర, 3 ఏళ్ళ లోపువారికి ఉచిత ప్రవేశం. స్కూల్ విద్యార్థులకు (13 నుంచి 17 ఏళ్ళ వయసు వారికి) 25 శాతం డిస్కౌంట్. సీఇయర్ సిటిజన్స్‌కి 60 శాతం డిస్కౌంట్, యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. టిక్కెట్లు బహ్రెయిన్ సిటీ సెంటర్ లేదా సీప్ మాల్ (సీఫ్ డిస్ట్రిక్ట్) వద్ద బిఐసి స్టాండ్స్‌లో లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







