ఏప్రిల్ 1న విడుదలకానున్న 'పిడుగు' చిత్రం
- March 22, 2016
వినీత్, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యానర్‌పై రామమోహన్.సి.హెచ్ దర్శకత్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం 'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి తన తనయుడు వినీత్‌ను హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 1న విడుదలవుతుంది. పిడుగు సినిమాకు సంబంధించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ '' సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాతో హీరోగా పరిచయమవుతున్న హీరో వినీత్ కమర్షియల్ హీరోగా రాణిస్తాడు. ఐదు సినిమాలు, ఐదు ఫైట్స్ తో ఫస్టాఫ్ అంతా లవ్ ట్రాక్, సెకండాప్ అంతా యాక్షన పార్ట్ తో సినిమా అంతా ఎంటర్ టైనింగ్ వేలో సినిమా రన్ అవుతుంది.
సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నాం'' అన్నారు.వినీత్, మోనికా సింగ్, వినోద్‌కుమార్, బెనర్జీ, అనంత్, ఫణి, ముఖ్తార్ ఖాన్, ప్రియాంక, సంధ్యాజనక్, ప్రభావతి, జూ.రేలంగి నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ః వెంకటేష్.ఆర్, మాటలుః రమేష్ రాయ్, పాటలుః భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, సంగీతంః కార్తీక్, విజయ్ కురాకుల, కెమెరాః పి.ఎస్.ప్రకాష్, ఎడిటర్ః కార్తీక్ శ్రీనివాస్, నిర్మాతః అశోక్ గోటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః రామమోహన్.సి.హెచ్.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







