యూఏఈ జాతీయ దినోత్సవ ఆఫర్: వచ్చే ఆరు నెలలకు 50 జీబీ మొబైల్ డేటా

- December 03, 2021 , by Maagulf
యూఏఈ జాతీయ దినోత్సవ ఆఫర్: వచ్చే ఆరు నెలలకు 50 జీబీ మొబైల్ డేటా

యూఏఈ: ఉచిత 50 జీబీ డేటాతో వర్జిన్ మొబైల్ యూఏఈ, అత్యద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఆరు నెలలపాటు ఈ డేటా అందుబాటులో వుంటుంది. 12 నెలల ప్లాన్ 7 జిబి అంతకంటే ఎక్కువ ప్లాన్ గనుక వినియోగదారులు కొనుగోలు చేస్తే, ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందుకోసం యూఏఈ50 అనే కోడ్ వినియోగించాల్సి వుంటుంది. ఇప్పటికే వినియోగదారులుగా వున్నవారు కొత్త సిమ్ కార్డుని తమ వర్జిన్ మొబైల్ ప్లాన్‌కి జోడించుకోవచ్చు. 7జిబి ప్లాన్ కంటే తగ్గితే, వారికి ఆ అవకాశం లభించదు. కాగా, ఇటీవల ఎటిసలాట్ కూడా 50జీబీ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఏఈ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఈ ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com