భవన భద్రత మరియు ఫైర్ ప్రొటెక్షన్ కోసం ఇ-సర్వీసుని ప్రారంభించిన సివిల్ డిఫెన్స్

- December 03, 2021 , by Maagulf
భవన భద్రత మరియు ఫైర్ ప్రొటెక్షన్ కోసం ఇ-సర్వీసుని ప్రారంభించిన సివిల్ డిఫెన్స్

మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, నేషనల్ పోర్టల్ 'bahrain.bh' ద్వారా ఎప్పటికప్పుడు కొత్త సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తోంది. సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అలి ముహమ్మద్ అల్ హౌతి మాట్లాడుతూ, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సూచనల మేరకు ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ సహకారంతో ఇ-సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. భవనాలకు సంబంధించి భద్రత అలాగే ఫైర్ ప్రొటెక్షన్ మరియు ప్రివెన్షన్ నిమిత్తం ఇ-సేవను అందుబాటులోకి తెచ్చారు. సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం, పరిశీలించడం, చెల్లుబాటుని తెలుసుకోవడం వంటివి లబ్దిదారులకు సులభతరమవుతుంది ఈ కొత్త విధానం ద్వారా. సర్టిఫికెట్ విషయమై సంబంధిత అథారిటీ వున్న వ్యక్తి తన  వివరాల్ని పొందుపరిచి, లైసెన్సు నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవడానిక వీలుంటుంది. అవసరమైన పేమెంట్ చేయడం, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సి వుంటుంది. ఇ-గవర్నమెంట్ సర్వీసుల విషయమై మరింత సమాచారం కోసం 80008001 నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com