అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు...
- December 09, 2021
న్యూ ఢిల్లీ: కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాతో డిసెంబర్ 17 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది.అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో వేగంగా కరోనా వ్యాపిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలోని అనేక దేశాల్లో బయటపడటంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఏ పునరాలోచనలో పడింది.కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందే భారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు.
ఆ తరువాత ఎయిర్ బబుల్ ఒప్పందం కింద 32 దేశాలకు విమాన సర్వీసులను నడుపుతున్నారు.పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ సర్వీసులు నడుస్తున్నాయి.డిసెంబర్ 17 నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానాలు నడపాలని అనుకున్నా ఒమిక్రాన్ కేసుల కారణంగా ఆ నిర్ణయాన్ని డీజీసీఏ వెనక్కి తీసుకుంది.జనవరి 31, 2022 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారమే విమాన సర్వీసులు సడుస్తాయని ప్రకటించింది.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







