దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విపరీతమైన వీకెండ్ రద్దీ
- March 24, 2016
ఈ వారాంతం దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమిరేట్స్ టెర్మినల్ 3 నందు 115,000 మందికి పైగా ప్రయాణీకులతో కూడిన రద్దీ వుండే అవకాశాలున్నాయి. మార్చ్ 27, 28 తేదీల్లో ఈ ట్రాఫిక్ రద్దీ ఉండనుందని అంచనా వేస్తున్నారు. ఇంతటి రద్దీ నేపథ్యంలో ప్రయాణీకులు నిర్ణీత సమయానికన్నా ముందే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడం ఉత్తమమని అధికారులు సూచించారు. డిపాచ్యూర్‌కి ఆరు గంటల ముందే ఫిజికల్ చెక్‌కి అవకాశం ఉందనీ, గంట ముందుగా చెక్ ఇన్‌ని నిలిపివేస్తారు కాబట్టి, ప్రయాణీకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ నేపథ్యంలో ఎమిరేట్స్, ఆన్‌లైన్ చెక్ ఇన్ టైమ్‌ని 24 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. కార్ పార్కింగ్ చెక్ ఇన్ సౌకర్యాలను కూడా రౌండ్ ది క్లాక్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ క్లాస్ మరియు బిజినెస్ క్లాస్ ప్రయాణీకుల కోసం చాఫర్ డ్రివెయన్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్‌ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







