'బంగారు బతుకమ్మ'
- June 08, 2015
తెలంగాణ తల్లి ఒడిలొ ఉయ్యాలూగు బతుకమ్మ
పది జిల్లల ప్రజల చేత పూజలొందు గౌరమ్మా
ఇంటింటికి ఇలవేల్పై మా కంటికి కనురెప్పై
సల్లంగా జూసి మమ్ము సంకటాలు కడ తేర్చి
బతుకులుద్ధరించు తల్లి బంగారు బతుకమ్మ IIబతుకులుII
గునుగుబువ్వు తంగేడు గులాబీలు గన్నేరులు
బంతిపూలు చేమంతులు బొడ్డుమల్లె సంపెంగలు
రకరకాల పూలు తెచ్చి రంగులతో రంగరించి
భక్తితోడ నీ పూజకు బతుకమ్మలు జేస్తుంటే IIబతుకులుII
పట్టుచీరగట్టి తలలొ మల్లెపూల మాల జుట్టి
ముత్తైదువులంత గలిసి మురిపెముగా ముందుకొచ్చి
ముచ్చటైన చప్పట్లతొ నీ చుట్టూ తిరుగుకుంటు
గొంతులెత్తి తియ్యంగా నీపాటలు పాడుతుంటే IIబతుకులుII
తియ్యనీ మలీద లడ్లు కమ్మనైన పులిహోర
పప్పుబెల్లము పెరుగన్నము పట్టుదలతొ తెచ్చి నీకు
సద్దుల బతుకమ్మవంటు సద్దులు నైవేద్యమెట్టి
రోజంతా నీపూజలు మోజుపడుతు చేస్తుంటే IIబతుకులుII
అందరికీ ఆసరిచ్చు హైద్రాబాదు అన్నయ్యలు
ఆత్మగల్ల పాణమున్న ఆదిలాబాదు అక్కయ్యలు
నిజమైన ప్రేమజూపు నిజాంబాదు తమ్ముళ్ళు
మల్లెపూల మనసులున్న మెదకులోని చెల్లెళ్ళు
కల్తిలేని మాటలాడు కరీంనగరు కాకయ్యలు
మమకారం మస్తుగున్నమహబూబ్నగరుమామలతో
బలగమంత జేరి నీకుసంబరాలు జేస్తుంటే IIబతుకులుII
ఖమ్మంలో కొలువున్న భద్రాచల రామయ్య
రంగారెడ్డి చెలక లోని చిలుకూరు బాలాజీ
నల్గొండ కొండపైని యాదగిరి నరసింహ సామి
వరంగల్లు జిల్లా లోని వెయ్యి స్తంభాల గుళ్ళ
దేవుళ్ళే దిగి వచ్చి నీ జాతర జరుపుతుంటే IIబతుకులుII
ముఖ్యమంత్రి కేసీయారు ఇతర మంత్రులంత గూడి
బతుకమ్మను ప్రజల బతుకు దేవతగా ప్రకటించి
నీ వేడుక రాష్ట్రానికి అధికారిక పండుగంటు
తెలంగాణ సర్కారే సంబరాలు జరుపుతుంటే IIబతుకులుII
అబుధాబీ షార్జాఃలు దుబాయ్ లున్న తెలుగోళ్ళు
చిన్నపెద్ద పేదగొప్ప తేడలేమి జూపకుండ
ఆనందముతోడ వచ్చి ఆటపాటలాడుకుంటు
అంగరంగ వైభవంగ నీపూజలు జేస్తుంటే IIబతుకులుII
…నక్క భాస్కర రావు(అబుధాబి)
తేది: 26. 9. 2014
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







