బాలయ్య 100వ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం
- June 08, 2015
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో 'డిక్టేటర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన 100వ సినిమా చేయబోతున్నారు. కెరీర్ మైల్ స్టోన్ మూవీ కాబట్టి బాలయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తనకు కెరీర్లో సింహా, లెజెండ్ లాంటి భారీ విజయాలు అందించిన బోయపాటి శ్రీనుకే దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే బాలయ్యకు బోయపాటి స్టోరీ లైన్ చెప్పారని, బాలయ్య నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని లెజెండ్ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బేనర్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 'డిక్టేటర్' సినిమా విషయానికొస్తే... ఈ చిత్రానికి లక్ష్యం, లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలయ్య, అంజలిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేయగా.... బోయపాటి శ్రీను క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి గోపాల్, సురేష్ బాబు, అంబిక కృష్ణ, సురేష్ బాబు, కోన వెంకట్, గోపీ మోహన్, సత్యదేవ్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ఆర్.పి.పట్నాయక్, ధశరత్, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







