సోయా పాలకూర
- June 08, 2015
కావలసిన పదార్ధాలు:
- సోయా చంక్స్ - 1/4 కిలో
- పాలకూర - 4 కట్టలు
- పచ్చిమిర్చి - 6
- వెల్లుల్లి - 4 రెబ్బలు
- ఉల్లిపాయ - 1
- ఉప్పు - తగినంత
- జీలకర్ర - 1 టీ స్పూను
- ధనియాల పొడి - 1 టీ స్పూను
- గరం మసాల - 1 టీ స్పూను
- నీళ్ళు - తగినన్ని
- జీలకర్ర పొడి - 1 టీ స్పూను
- పసుపు - 1/2 టీ స్పూను
- నిమ్మరసం - 1/2 టీ స్పూను
- టమాటో గుజ్జు - 2 టీ స్పూన్లు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
చేయు విధానం:
- సోయా చంక్స్ వేడినీళ్ళలో వేసి పది నిమిషాలు ఉంచాలి.
- ప్రెషర్ పాన్ లో నూనె వేసి పసుపు, జీలకర్ర వేసి వేయించాలి.
- తరువాత ఉల్లిముక్కలు, ఉప్పు వేసి కలపాలి.
- ఇందులో వెల్లుల్లి ముక్కలు, సోయా చంక్స్ వేసి కాసేపు వేయించాలి.
- ధనియాల పొడి, గరం మసాలా, టమాటో గుజ్జు వేసి కలపాలి.
- తరువాత సుమారు ఓ గ్లాసు నీళ్ళు పోసి కలిపి ఉడికించాలి.
- నీళ్ళన్నీ ఆవిరైపోయాక తురిమిన పాలకూర వేసి సిమ్ లో ఉడికించాలి.
- పచ్చిమిర్చి గుజ్జు కూడా వేసి మూడు నిమిషాలు ఉడికించాక దించాలి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







