కొంకణి చికెన్ కర్రీ
- March 24, 2016
కావలసిన పదార్థాలు: చికెన్ (పెద్ద ముక్కలు) - 800 గ్రా., పచ్చికొబ్బరి తురుము - రెండు కప్పులు, ఉల్లిపాయలు - 4, కారం - 1 టీ స్పూను, పసుపు - అర టీస్పూను, గరం మసాల పొడి - 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్టు - 3 టీ స్పూన్లు, ఉప్పు - సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: చికెన్ ముక్కలపై కత్తితో పొడుగ్గా గాటు పెట్టి, అల్లం మిశ్రమాన్ని కూరి గంటపాటు పక్కనుంచాలి. కొబ్బరి తురుముని కొద్ది నూనెలో వేగించి, సగం ఉల్లి ముక్కలతో కలిపి పేస్టు చేసుకోవాలి. నూనెలో మిగతా ఉల్లితరుగు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, గరం మసాల పొడి, కారం, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి 10 నిమిషాలు (బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు) వేగించాలి. తర్వాత ఉల్లి, కొబ్బరి పేస్టు, ఉప్పు వేసి 4 కప్పుల నీరు పోసి మూత పెట్టాలి. చికెన్ ఉడికి, నూనె తేలిన తర్వాత కొత్తిమీర చల్లాలి. ఈ కర్రీ పలావ్, జీరారైసులతో బాగుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







