రోజు మెట్లు ఎక్కితే ఆరోగ్యానికి మంచిది!

- March 24, 2016 , by Maagulf
రోజు మెట్లు ఎక్కితే ఆరోగ్యానికి మంచిది!

ప్రతిరోజూ కొంతసేపు మెట్లు ఎక్కడం ద్వారా మెదడు వయసు తగ్గడమే కాకుండా, ఎంతో చురుగ్గా మారుతుందని తాజాగా జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. మెట్లు ఎక్కడం ద్వారా కొవ్వు తగ్గి శరీరం తేలిగ్గా ఉండడమే గాక మెదడు వయస్సు తగ్గుతుందని పరిశోధన తెలిపింది. కెనడాలోని కంకార్డియా విశ్వవిద్యాలయానికి చెందిన జాసన్‌ స్టెఫెనర్‌ బృందం చేపట్టిన ఈ పరిశోధనపై 'న్యూరో బయోలజీ ఆఫ్‌ ఏజింగ్‌' పత్రిక ఇటీవల వ్యాసం ప్రచురించింది. పరిశోధనలో భాగంగా 19-79 సంవత్సరాల మధ్య వయసున్న 331 మంది ఆరోగ్యవంతులతో మెట్లు ఎక్కించారు. కళాశాలలకు పంపారు. వీరి మెదళ్లలో న్యూరాన్లకు నిలయమైన గ్రేమ్యాటర్‌ పరిమాణాలను గమనించారు. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ మెదడు న్యూరాన్లను కోల్పోయి, గ్రేమ్యాటర్‌ పరిమాణంలో మార్పులు వస్తుంటాయి.
ఆ ప్రకారం ఒక ఏడాది చదువుకోవడం వల్ల మెదడు వయసు 0.95 సంవత్సరం, రోజూ రెండు అంతస్తుల మెట్లు ఎక్కడం వల్ల 0.58 సంవత్సరం చొప్పున తగ్గుతున్నట్లు జాసన్‌ లెక్కగట్టారు. వృద్ధులు, వృద్ధాప్యానికి చేరువలో ఉన్నవారు నిత్యం వీలైనన్ని మెట్లు ఎక్కడం వల్ల మెదడును చురుగ్గా ఉంచుకోవచ్చని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com