దుబాయ్‌లో శని, ఆదివారాల్లో పెయిడ్ పార్కింగ్
- December 27, 2021
దుబాయ్: యూఏఈలో నాలుగున్నర రోజుల వర్క్ వీక్‌గా మారిన తర్వాత కూడా దుబాయ్‌లో పెయిడ్ పార్కింగ్ కొనసాగనుంది.ఈ వీకెండ్ శని, ఆదివారాల్లో పెయిడ్ పార్కింగ్ సర్వీస్ అమల్లో ఉండనుంది. అయితే ప్రభుత్వం నోటీస్ ఇచ్చే వరకు శుక్రవారాలు, ప్రభుత్వ సెలవు దినాలలో ఉచిత పార్కింగ్ సేవలు కొనసాగుతాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. మెట్రో, ట్రామ్, వెహికిల్ టెస్టింగ్ సెంటర్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూసివేత కోసం RTA కొత్త పని వేళలను ప్రకటించింది. కొత్త సమయాలు జనవరి 3(సోమవారం), 2022 నుండి అమలులోకి వస్తాయి.
వాహన పరీక్ష కేంద్రాలు
సాంకేతిక కేంద్రాలు ఆదివారం నుండి గురువారం వరకు వారం పాటు తెరిచి ఉంటాయి. శుక్రవారం 4pm నుండి 9pm వరకు పని చేస్తాయి. శనివారం ప్రభుత్వ సెలవుదినం.
దుబాయ్ మెట్రో
రెడ్ , గ్రీన్ లైన్లు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి 1.15 వరకు పని చేస్తాయి. శుక్రవారం, శనివారాల్లో మెట్రో లైన్లు ఉదయం 5 నుండి 2.15 వరకు పనిచేస్తాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి తెల్లవారుజామున 1.15 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
దుబాయ్ ట్రామ్
సోమవారం నుండి శనివారం వరకు సర్వీస్ వేళలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటాయి. ఆదివారం ఉదయం 9 నుండి 1 గంటల వరకు సేవలు అందిస్తాయి.
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూసివేత
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఫిబ్రవరి 2, 2022 నుండి శనివారం రాత్రి 10 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు.
కస్టమర్ సర్వీస్ సెంటర్లు
సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 7.30 వరకు తెరిచి ఉంటాయి. శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.. శని, ఆదివారాల్లో బంద్ ఉంటాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







