వ్యవసాయం లోకి అడుగుపెడుతున్న ఫేస్ బుక్ అధినేత
- December 29, 2021
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ అంచనాలకు అతీతంగా ప్రవర్తిస్తుంటారు. ఫేస్ బుక్ ఆరంభించినప్పటి నుంచి కొత్త అప్డేట్ లతో యూజర్లకు దగ్గరవుతూనే ఉన్న మార్క్ ఇప్పుడూ కొత్త రూట్ పట్టారు.
17మిలియన్ డాలర్లు (రూ.127కోట్లు)తో హవాయి లో స్థలం కొనుగోలు చేసి వ్యవసాయం మొదలుపెట్టనున్నారట.
ఇంతపెద్ద స్థలాన్ని వ్యాపారి కొనుగోలు చేయడమంటే అందరూ ఏదో పెద్ద ప్రాజెక్ట్ గురించే ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ, ఇదంతా వ్యవసాయం కోసమే అని చెప్తున్నారు జూకర్ బర్గ్ భార్య. 100ఏళ్ల నాటి కా లోకో రిజర్వాయర్ 2016లో ధ్వంసమైంది. వరదల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
ప్రస్తుతం మెటా సీఈఓ 1500ఎకరాలు కొనుగోలుచేశారు. జూకర్ బర్గ్ అందులో పూర్తిగా వ్యవసాయం చేయాలనే అనుకుంటున్నారు. అంతేకాకుండా అటవీ జీవితాన్ని పెంచాలని ప్లాన్ చేస్తున్నారని అతని భార్య ప్రిస్కిల్లా చాన్ వెల్లడించారు. ఆ స్థలంలోనే విశాలవంతమైన ఇల్లు కట్టుకుని ఉంటారట. 35వేల 888 చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం చేపడతారు. దీని విలువ దాదాపు 35మిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!







