ఏపీ కరోనా అప్డేట్
- December 29, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.అయితే, ప్రస్తుతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఏపీలో తాజాగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 16కు పెరిగింది.ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 31,743 శాంపిల్స్ పరీక్షించగా.. 162 మందికి పాజిటివ్‌గా తేలింది.ఇదే సమయంలో 186 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 3,12,62,099కు చేరగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,849కు పెరిగింది. ఇప్పటి వరకు 20,61,308 మంది రికవరీ అయితే.. 14,492 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం రాష్ట్రంలో 1,049 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







