46 లక్షల కనెక్షన్లను అర్హులైన పేదలకు : ని ర్మలా సీతారామన్
- March 25, 2016
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా రెండేళ్లలో 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తాడేపల్లిగూడెంలోని జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన హాకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు.గివ్ ఇట్ అప్ పథకానికి దేశ వ్యాప్తంగా విపరీత స్పందన వచ్చిందని, 55 లక్షల మంది గ్యాస్ రాయితీలను వదులుకున్నారని తెలిపారు. ఇలా వదులుకున్న వాటిలో 46 లక్షల కనెక్షన్లను అర్హులైన పేదలకు కేటాయించామన్నారు.తాగునీటి కాలుష్యం వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని, అందువల్ల ప్రతి జిల్లాలో ప్రభుత్వం తరఫున ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







