ఒమిక్రాన్ ను లైట్ తీసుకోవద్దు.. WHO హెచ్చరిక..!
- January 06, 2022
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ఒమిక్రాన్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పుడు భారతదేశంలోనూ ఒమిక్రాన్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య లక్షవరకు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఒమిక్రాన్ సాధారణ జలుబు కాదని అంటోంది. సాధారణ వ్యాధిగా భావించరాదని హెచ్చరిస్తోంది. లేదంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకారిగా మారే ముప్పు ఉందని WHO టెక్నికల్ లీడ్ మరియా వాన్ కేర్ఖోవ్ హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువ అయినప్పటికీ అది తేలికపాటి వ్యాధి మాత్రం కాదన్నారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు మాత్రం అసలే కాదన్నారు. వృద్ధులు ఈ వేరియంట్ బారినపడితే తీవ్ర అనారోగ్య పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు. ఒమిక్రాన్ కేసులతో ఆస్పత్రులన్నీ నిండిపోయే ప్రమాదం ఉందని కేర్ఖోవ్ హెచ్చరించారు.
ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉంటుంది కదాని లైటుగా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా హెచ్చరిస్తోంది. మరోవైపు.. డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే.. ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఒమిక్రాన్ వైరస్ తీవ్రత తక్కువే.. చాలా తక్కువ మంది మాత్రమే తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఒమిక్రాన్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా అనీ నిర్లక్ష్యంగా కూడా ఉండరాదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







