మొదలైన థర్డ్ వేవ్..అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ హెచ్చరిక
- January 06, 2022
తెలంగాణ: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ మొదలైపోయింది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేవారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. అమెరికాలో నిన్నటి రోజు పది లక్షల కేసులు నమోదయ్యాయి, యూకేలో మొత్తం మూడు లక్షల కేసులు వెలుచూశాయి.. మనదేశంలో కూడా మూడో వేవ్ స్టార్ట్ అయ్యిందన్నారు.. అందులో భాగంగానే నిన్న ఒక్కరోజే 50 వేల కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు..
దేశంలో 15 రాష్టాల్లో మూడోవేవ్ స్టార్ట్ అయ్యిందన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ఢిల్లీలో ఒక్క రోజే 10 వేల కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణలో 1600 కేసులు నిన్న నమోదు అయ్యాయి.. రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డిల్లో కేసులు పెరిగాయన్నారు.. దేశంలో 2 నుంచి 6 రేట్లు కేసులు పెరిగాయి.. తెలంగాణలో నాలుగు రేట్లు కేసులు పెరిగాయన్న ఆయన.. తీవ్రమైన సమస్యలు తలెత్తకుండా ఉండటం మంచి పరిణామం అన్నారు.. ఇక, రాష్ట్రంలో బెడ్ల కొరత లేదు.. ఇప్పుడు కోవిడ్ బారిన పడినవాల్లు ఐదు రోజుల్లో కోలుకుంటున్నారన్న ఆయన.. మరోవైపు 95 శాతం మంది పాజిటివ్ కేసుల్లో లక్షణాలు ఉండటం లేదన్నారు.. ఇక, ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ ఉంది.. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. కాగా, భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 325 మంది కోవిడ్ బాధితులు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..