హెచ్ఏఎల్ లో ఉద్యోగాలు
- January 09, 2022
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నిషియన్ అప్రెంటీస్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా.. కేవలం అకడామిక్ మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా రూ.8,000 నుంచి రూ.9,000 వరకు స్టైఫండ్ అందజేస్తారు.
టెక్నిషియన్, అప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు సంబంధించి 80 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లమా చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు దరఖాస్తుకు అర్హులు.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు సంబంధించి 70ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లమా చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు దరఖాస్తుకు అర్హులు
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2022 నుంచి జనవరి 17, 2022 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారక వెబ్‌సైట్ https://portal.mhrdnats.gov.in/
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







