సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్..

- January 09, 2022 , by Maagulf
సీనియర్ హీరో  రాజేంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్..

హైదరాబాద్: కరోనా కల్లోలం కొనసాగుతుంది. మరో సారి ఈ మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తుంది. ఆల్‌రెడీ బాలీవుడ్‌ను వణికిచ్చేస్తోన్న కరోనా… తాజాగా టాలీవుడ్ లోనూ ప్రకంపణలు రేపుతోంది. ఈ మహ్మమారి దాటికి ఇప్పటికే  సినిమా షూటింగ్‌లన్నీ క్యాన్సిల్ అవుతుండగా… సెలబ్రిటీలు దీని బారిన పడి ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే కరోనా సోకిన నటుడు సత్యరాజ్‌ తాజాగా క్రిటికల్ కండీషన్లో ఉన్నారట. ఇప్పుడిదే న్యూస్‌ ఆందోళన కలిగిస్తోంది. సత్య రాజ్ మాత్రమే కాదు మనదగ్గర, మంచు మనోజ్, మంచు లక్ష్మీ,  విశ్వక్ సేన్, మహేష్ బాబు, తమన్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా వరుసగా అందరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ కోవిడ్ చికిత్స నిమిత్తం ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. పలువురు ఆయన ఫ్యామిలీ మెంబర్స్కు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారని తెలుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఫ్యాన్స్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఇక ఆయన ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com