మంత్రి హరీష్ రావు ని కలిసిన బాలకృష్ణ
- January 10, 2022
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు నేడు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను నందమూరి బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రికి వివరించారు. అంతే కాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి ప్రభుత్వం నుండి తగిన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు.ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణతో పాటు డా.ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI వారు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







