ఖతార్ ఎయిర్ వేస్ 25వ వార్షికోత్సవం: 25 శాతం డిస్కౌంట్

- January 10, 2022 , by Maagulf
ఖతార్ ఎయిర్ వేస్ 25వ వార్షికోత్సవం: 25 శాతం డిస్కౌంట్

ఖతార్: ఖతార్ ఎయిర్ వేస్ 25వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో విమాన టిక్కెట్లపై 25 శాతం డిస్కౌంట్‌ని ప్రయాణీకులకు అందించనుంది. సీట్ సెలక్షన్, అదనపు బ్యాగేజీ అలవెన్స్, హోటల్ బుకింగ్స్, కార్ రెంటల్స్ మీద ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. జనవరి 10 నుంచి పది రోజులపాటు ఈ క్యాంపెయిన్ నడుస్తుంది. ప్రయాణీకులు అదనంగా 2,500 క్యు మైల్స్ బోనస్‌గా పొందే అవకాశం కూడా వుంది. ఇందుకోసం FLYQR22 qlo ప్రోమో కోడ్ వినియోగించాలి. బిజినెస్ మరియు ఎకానమీ క్లాస్ ప్రయాణీకులకు 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 140 డెస్టినేషన్లకు దీన్ని వర్తింపజేస్తారు. అక్ోటబర్ 31, 2022 వరకు ప్రయాణాలు చేసే వీలుంది. సిల్వర్, గోల్డ్ మరియు ప్లాటినం సభ్యులు తమ టైర్ స్టేటస్‌ని పొడిగించుకోవచ్చు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com