ఏపీ కరోనా అప్డేట్
- January 10, 2022
అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. కాగా, నిన్నటి 1257 కేసులతో పోలిస్తే కాస్త తగ్గాయి.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 984 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనాతో ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదు.గడిచిన 24 గంటల్లో 24వేల 280 శాంపిల్స్ పరీక్షించారు. నిన్న ఒక్కరోజే 152 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,16,30,231 శాంపిల్స్ పరీక్షించారు.
తాజాగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 244 కేసులు వెలుగుచూశాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.విశాఖలో 151 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 117 కేసులు రికార్డ్ అయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,82,843. రాష్ట్రంలో మొత్తం 5వేల 606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,732 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 505గా ఉంది.
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం భారత్లో కనిపిస్తోంది. అనుకున్న దానికంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. గత 10 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 50వేల లోపు నమోదైన కరోనా కేసులు ఇప్పుడు లక్ష 50 వేలకు పైగా నమోదవుతున్నాయి.
తాజాగా దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే ఒక లక్షా 79వేల 723 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 146 మంది కోవిడ్ తో చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరుకుంది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు