ప్రికాషనరీ క్వారంటైన్ ప్రోటోకాల్ అప్డేట్
- January 12, 2022
మనామా: ప్రికాషనరీ (ముందు జాగ్రత్త) క్వారంటైన్ ప్రోటోకాల్ ను నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ ఫర్ కంబాటింగ్ అప్డేట్ చేసింది. కొత్త ప్రోటోకాల్ 13 జనవరి 2022 నుండి ప్రారంభమవుతుంది. బీఅవేర్ బహ్రెయిన్ అప్లికేషన్లో గ్రీన్ షీల్డ్‌ను కలిగి ఉన్న వ్యక్తులకు ప్రికాషనరీ క్వారంటైన్ పీరియడ్ ఏడు రోజులకు తగ్గించారు. గ్రీన్ షీల్డ్ హోల్డర్లు PCR పరీక్ష తీసుకోకుండానే ఏడు రోజుల తర్వాత క్వారంటైన్ నుండి బయటకు రావచ్చు. టీకాలు వేసుకోని వ్యక్తులు లేదా బీఅవేర్ బహ్రెయిన్ యాప్‌లో పసుపు లేదా ఎరుపు షీల్డ్ ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా ఇన్ఫెక్షన్కు గురైన తేదీ నుండి పది రోజుల పాటు నిర్బంధంలో ఉండాలి. టాస్క్‌ఫోర్స్ అన్ని నౌకాశ్రయాల ద్వారా బహ్రెయిన్‌లోకి ప్రవేశించే ప్రయాణికుల కోసం ముందుజాగ్రత్తగా నిర్బంధ ప్రోటోకాల్ ను అప్డేట్ చేసింది. బీఅవేర్ బహ్రెయిన్ యాప్‌లో పసుపు లేదా ఎరుపు రంగు షీల్డ్‌ను కలిగి ఉన్న వ్యక్తులు, టీకాలు వేసుకోని ప్రయాణికులు ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. బీఅవేర్ బహ్రెయిన్ అప్లికేషన్లో గ్రీన్ షీల్డ్ పట్టుకున్న ప్రయాణికులకు ఎలాంటి నిర్బంధ నిబంధనలు వర్తించవు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







