అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పై ఈ సమయాల్లో సాలిక్ ఉండదు
- January 12, 2022
యూఏఈ: వీక్ డేస్ రాత్రి సమయంలో, ఆదివారం రోజంతా అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పై వెళ్లే వాహనాలకు సాలిక్ వర్తించదని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. జనవరి 15 నుండి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూసివేసే సమయాలు ఇలా ఉండనున్నాయి.
వీక్ డేస్: సోమవారం నుండి శుక్రవారం వరకు, రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు.
వీకెండ్స్: శనివారం రాత్రి 10 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు.
సవరించిన సమయాలు UAE కొత్త వర్క్‌వీక్ కు అనుగుణంగా ఉన్నాయి. దేశంలో శుక్రవారం సగందినం, శనివారం, ఆదివారం సెలవు దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
సాలిక్ అనేది దుబాయ్ యొక్క ఆటోమేటిక్ రోడ్ టోల్ కలెక్షన్ సిస్టమ్. వాహనం సాలిక్ పాయింట్ గుండా వెళ్ళిన ప్రతిసారీ, ప్రీపెయిడ్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా Dh4 టాక్స్ కట్ అవుతుంది. అల్ మక్తూమ్ వంతెన (ఉమ్ హురైర్ రోడ్) దుబాయ్‌లోని ఏడు టోల్ గేట్లలో ఒకటి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







