ఒమిక్రాన్ భయం..ఆవేదనలో తెలుగు ఎన్నారైలు
- January 12, 2022
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. లెక్కకు మించిన కేసులు రోజు రోజుకు నమోదు అవుతున్న నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. ట్రావెల్ విషయంలో ఆక్షలు పెట్టాయి. అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో కూడా నమోదవని విధంగా కేసులు పెరుగుతున్నాయి.
ఒకరకంగా చెప్పాలంటే ఒమిక్రాన్ కేసుల విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉంటూ రికార్డులు సృష్టిస్తోందని చెప్పాలి. అయితే ఒమిక్రాన్ విజృంభణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
శోభ లేని పండుగలు
సంక్రాతి సమయంలో సొంత ఊర్లకు ఓ వారం ముందుగానే వచ్చి ఓ నెల రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకొని తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేవారు. తమ పిల్లలకు సొంత ఊరు తిప్పి చూపుతూ బంధువులను పరిచయం చేస్తూ సంక్రాతి సంబరాల్లో మునిగిపోయేవారు.
కానీ ఇప్పుడు అలన్తి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఒమిక్రాన్ కారణంగా విధించిన ప్రయాణ ఆక్షలు ఎన్నారైలకు అడ్డుగా మారాయి. పోనీ అన్ని అడ్డంకులు దాటుకుని సొంత ఊర్లకు వచ్చేద్దామా అంటే ఒమిక్రాన్ మరింత తీవ్రం అయ్యి అంతర్జాతీయ ప్రయాణాలను నిలిపివేస్తే మళ్ళీ గతంలోలా నెలల తరబడి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో అని, ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు సైతం పోగొట్టుకున్నారని, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి సంవత్సరం పైనే పట్టిన సందర్భాలను గుర్తుచేసుకొని హడలిపోతున్నారు.
తెలుగు సంఘాలకే వీళ్ళ ఓట్లు
ఈ పరిస్థితుల నేపథ్యంలో అధిక శాతం ఎన్నారైలు విదేశాలలో ఉన్న తెలుగు సంఘాలు ఏర్పాటు చేసే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఎప్పటిలా సంక్రాంతికి సొంతూరులో గడపలేకపోతున్నామనే బాధ కలచివేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన తెలుగు ఎన్నారైలు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







