వీసా స్క్రీనింగ్ అపాయింట్మెంట్ల కోసం SEHA యాప్ స్టార్ట్
- January 13, 2022
అబుధాబి: UAE లో అతిపెద్ద హెల్త్‌కేర్ నెట్వర్క్ అయిన అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (SEHA).. వీసా స్క్రీనింగ్ సెంటర్లలో అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ప్రక్రియను సులభతరం చేయడానికి SEHA వీసా స్క్రీనింగ్ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం పర్సనల్ బుకింగ్ మాత్రమే అందుబాటులో ఉండగా తదుపరి దశలో వ్యాపార వర్గాలకు అందుబాటులోకి వస్తుంది. ఎమిరేట్‌లో ఉన్న అబుదాబి సిటీ, ముస్సాఫా, అల్ షహమా, బనియాస్, స్వీహాన్, మదీనాత్ జాయెద్, డెల్మా, సిలా, ఘయాతి, అల్ మర్ఫా, ఎతిహాద్ లలో 12 డిసీజ్ ప్రివెన్షన్, స్క్రీనింగ్ సెంటర్లను SEHA నిర్వహిస్తోంది. వీటి ద్వారా సర్వీసులను సులభంగా పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఆధారిత అపాయింట్మెంట్ సర్వీస్‌ను ప్రారంభించడం ద్వారా SEHA బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తోంది. దీంతో వెయిటింగ్ టైమ్ తగ్గుతుంది. SEHA వీసా స్క్రీనింగ్ యాప్ ను iOS, Android ఫోన్లలో పనిచేసేలా రూపొందించారు. యాప్ స్టోర్, Google Play స్టోర్ల లో యాప్ అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా అంబులేటరీ హెల్త్‌కేర్ సర్వీసెస్‌లో చీఫ్ క్లినికల్ అఫైర్స్ ఆఫీసర్ డాక్టర్ ఒమర్ అల్ హష్మీ మాట్లాడుతూ.. SEHA వ్యాధి నివారణ, స్క్రీనింగ్ కేంద్రాలు - జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI)చే గుర్తింపు పొందాయన్నారు. వీసా ప్రక్రియ కోసం పూర్తి స్థాయి వైద్య సేవలను అందిస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







