భారత్ కరోనా అప్డేట్
- January 13, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి తగ్గేదేలే అన్న విధంగా రోజురోజకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో రోజూ కరోనా కేసులు భారీగా నమోదవతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా నేడు ప్రధాని మోడీ రాష్ట్రాల సీఎంలతో కోవిడ్ విజృంభనపై సమీక్షించానున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా 2,47,417 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు గడచిన 24 గంటల్లో మరో 84,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో ప్రస్తుతం 13.11 శాతం కరోనా పాజిటివిటీ రేటు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ, రైల్వే బస్టాండ్‌లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో కూడా భక్తులు తాకిడి అధికంగా ఉంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ అంక్షలు విధిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. బస్సులు, రైల్వే స్టేషన్‌లో కూడా కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్