లారెన్స్ సింగర్‌గా...
- March 26, 2016
ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో తనదైన టాలెంట్‌తో దూసుకుపోతున్న లారెన్స్ తనలో దాగి ఉన్న మరో టాలెంట్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే డ్యాన్సర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పలు బాధ్యతలను నిర్వర్తిస్తున్న లారెన్స్ తాజాగా సింగర్ అవతారమెత్తాడు. ఆటతోనే కాదు పాటతోను అలరించగలనని ప్రూవ్ చేసుకునేందుకు ఈ స్టైలిష్ కొరియో గ్రాఫర్ సిద్దమైనట్టు తెలుస్తుంది. లారెన్స్ ప్రస్తుతం తమిళంలో మొట్ట శివ కెట్ట శివ అనే సినిమా చేస్తున్నారు.లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం మొట్ట శివ కెట్ట శివ సెట్స్‌పై ఉండగా,ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పాటలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో లోకల్ మాస్ అంటూ ఊపొచ్చే సాంగ్ ఒకటి ఉంది.ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు ఉంటాయట. ట్యూన్స్‌కి తగ్గట్టు పాట కూడా మంచి సౌండింగ్‌తో ఉంటే ఇక ఆ పాట దుమ్మరేపుతుందని యూనిట్ భావించింది. ఈ పాటకు ఎలాగు లారెన్సే స్టెప్పులు వేస్తారు కాబట్టి, సాంగ్ కూడా అతనితో పాడిస్తేనే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించిందట. ఇక వెంటనే ఆ బాధ్యతను లారెన్స్ సమాచారం. ఈ చిత్రంలో లారెన్స్ సరసన నిక్కీ గల్రానీ హీరోయిన్‌గా నటిస్తుంది.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







