ఏప్రిల్ 1 నుంచి ఇ-ఆఫీసుల ప్రారంభం

- March 26, 2016 , by Maagulf
ఏప్రిల్ 1 నుంచి ఇ-ఆఫీసుల ప్రారంభం

 రాష్ట్రప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి తొలివిడతగా జిల్లాలో 10ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీసులను ప్రారంభించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తు.చ తప్పక జిల్లాలో అమలు చేయాలని కలెక్టర్ కెవి రమణ శనివారం కలెక్టరేట్‌లో జరిగిన అధికారుల సమావేశంలో ఆదేశించారు. తొలి విడతగా రెవెన్యూ, ట్రెజరీ అండ్ అకౌంట్స్, డిఆర్‌డిఏ, డ్వామా, రిజిస్ట్రేషన్, స్టాంపులు, పౌరసరఫరాలు, ఏపి సివిల్ సప్లైయ్స్, జెడ్పి, పంచాయతీ శాఖలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లలో ఇ-ఆఫీసు ద్వారా ఇ-ఫైళ్ల ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇ-ఫైళ్ల వ్యవహారంపై ఎన్‌ఐసి అధికారి విజయకుమార్, ఒక నోడల్ అధికారి, ఇరువురు మాస్టర్ ట్రైనర్లు, ఒక స్థానిక అడ్మిన్ మార్చి 31లోపల ఏర్పాటుచేసుకుని ఈ 10 కార్యాలయాల్లో ఇ-ఫైళ్ల ద్వారానే పరిపాలన ఉంటుందని ఆయన తెలిపారు.జిల్లాలో ఉచితంగా సరఫరా చేసే ఇసుక మైనింగ్, సేల్స్ మేనేజింగ్ సిస్టమ్‌ను మానటరింగ్ చేసి ఫిర్యాదుల విభాగానికి సెల్ ఏర్పాటుచేసి ఇసుక పక్కదారి పట్టకుండా మొబైల్ టీమ్ ద్వారా ఇసుక లభ్యమయ్యేచోట నిఘాపెట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కెవి రమణ అధికారులను ఆదేశించారు. అలాగే ఇసుక సరఫరాపై ఇసుక అక్రమ రవాణా కాకుండా చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పిడి బాలసుబ్రమణ్యం, అడిషనల్ ఎస్పీ విజయకుమార్, జెడ్పి సిఇఓ రిజియాబేగం, మైన్స్ అధికారులతో సమావేశమై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో 8,21,519 క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు చేయగా రూ.61.19కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు. జిల్లాలో గతంలో రీచ్‌లలో సిద్దం చేసిన 1,441 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉందని ఆ ఇసుకకు రూ.10.95లక్షలు చెల్లించాల్సివుంటుందన్నారు. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ ఫిర్యాదుల నిమిత్తం ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటుచేయడం జరిగిందని, వారి కేసుల విషయంలో ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎటువంటి కేసుపై ఫిర్యాదు అందినా సంబంధిత శాఖ అధికారులతో అధికారులు సంప్రదించి వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం వల్లూరు ,బద్వేలు,మైదుకూరు, రైల్వేకోడూరు, కమలాపురం, కడప, రాయచోటి మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులను అధికారులు పరిశీలించి వెంటనే వాటిని పరిష్కరించాలని లేనిపక్షంలో అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఫిర్యాదుల విషయంలో ఎస్సీలు, ఎస్టీలు కూడా తప్పుడు ఫిర్యాదులు చేయరాదని ఆయన సూచించారు. జాయింట్ కలెక్టర్ శే్వత టియోటియ, అడిషనల్ ఎస్పీ విజయకుమార్, సోషియల్ వెల్ఫేర్ డిడి సరస్వతి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ప్రతిభాభారతి, డిఆర్‌డిఏ ,డ్వామా పిడిలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, జెడ్పి, స్టెప్ సిఇఓలు రజియాబేగం, మమత, ఎన్‌ఐసి డిఐఓ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.దళిత కాలనీలను టార్గెట్‌చేసిన విద్యుత్ అధికారులు.!విద్యుత్ అధికారులు దళిత కాలనీలను లక్ష్యంగా చేసుకుని శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.125లకే విద్యుత్‌మీటర్లు అమర్చుకోవాలని సూచించిన అధికారులు శనివారం రోజు 23 గ్రామాల్లోని దళితుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు పూర్తిగా తొలగించారు. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు సైతం చదువుకునేందుకు ఇబ్బందులుపడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు వేడికి ఇబ్బందిపడుతున్నారు. విద్యుత్ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించి విద్యుత్‌ను సరఫరా చేసేలా చూడాలని కోరుతున్నారు. జాతీయ రహదారులను దిగ్బంధించిన దళితులు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో ఉన్న దళిత, క్రిస్టియన్ల ఇళ్లకు విద్యుత్ కట్ చేయడంతో వారు జాతీయ రహదారిపై మొద్దులు అడ్డంగా వేసి రాస్తారోకో నిర్వహిం చారు. నాగసానిపల్లె, ఖాజీపెట, నందిపాడు, దుం పలగట్టు ఉప విద్యుత్ కేంద్రాల పరిధిలోని గ్రామాల దళితులు విద్యుత్ కేంద్రాల వద్ద నిరసనలు తెలిపారు. పత్తూరు, బుడ్డాయపల్లె గ్రామస్తులు, దుంపల గుట్టు, పాటిమీదపల్లె, బాలా నగర్, రావులపల్లె గ్రామాల దళితులు జా తీయ రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. స్థానిక పోలీసులు , అధికారులు విద్యుత్ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి ఈష్టర్ పండుగ వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేశారు. లైన్‌మెన్ స్థాయి నుంచి ఎస్‌ఈ అధికారి వరకు ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉండడంతో వారు ఏమి చేయలేక గ్రామస్తులకు సర్ధిచెప్పి పంపపారు. ఆదివారం ఉన్నతాధి కారులతో మాట్లాడి విద్యుత్ పునరుద్ధరించేం దుకు ప్రయత్నిస్తామ ని చెప్పారు. దీంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com