హైద‌రాబాద్ డీఆర్‌డీఎల్‌లో ఉద్యోగాలు..

- January 16, 2022 , by Maagulf
హైద‌రాబాద్ డీఆర్‌డీఎల్‌లో ఉద్యోగాలు..

డీఆర్‌డీఎల్‌కు చెందిన రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్‌(RCMA) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది.హైద‌రాబాద్‌లో ఉన్నఈ సంస్థలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు? అర్హ‌త‌లు ఏంటి?అన్ని విశేషాలు మీకోసం..

భర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

  • నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 02 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మెకానికల్‌ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
  • పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీటెక్‌/బీఈ/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.వీటితో పాటు నెట్‌/గేట్‌ అర్హత సాధించి ఉండాలి.
  • అభ్య‌ర్థుల వ‌య‌సు 28 ఏళ్లు మించ‌కూడదు.

ముఖ్య‌మైన విష‌యాలు..

  • ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తులను రీజనల్‌ డైరెక్టర్, ఆర్‌సీఎంఏ(మిసైల్స్‌), డీఆర్‌డీఎల్‌ క్యాంపస్, కాంచన్‌బాగ్, హైదరాబాద్‌–500058 అడ్ర‌స్‌కు పంపించాలి.
  • అభ్య‌ర్థుల‌ను తొలుత అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్య‌ర్థుల‌కునెల‌కు రూ.31,000 జీతంగా అందిస్తారు.
  • ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 30-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

          పూర్తి వివ‌రాల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చెయ్యండి.

           https://www.drdo.gov.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com