కువైట్ లో రోజుకు 11వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు
- January 16, 2022
కువైట్ సిటీ: కువైట్ లో రోజురోజుకు ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి.తాజాగా ట్రాఫిక్ విభాగం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.2021 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా మొత్తం 4,03,608 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అంటే రోజువారీగా సరాసరి 11వేల ఉల్లంఘనలు నమోదయ్యాయి.వీటిలో చాలా వరకు ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. కూడళ్లలో ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో వాహనదారులు చేసే ప్రతి చిన్న ఉల్లంఘన కూడా రికార్డు అవుతుందని ఈ సందర్భంగా ట్రాఫిక్ విభాగం పేర్కొంది. కనుక వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం మంచిదని సూచించింది. అటు ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ జరిమానాలను భారీగా పెంచిన వాహనదారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







