డ్రోన్ల యాక్టివిటీని నిలిపివేసిన UAE
- January 23, 2022
యూఏఈ: డ్రోన్లు, తేలికపాటి క్రీడా విమానాలతో సహా అన్ని ఫ్లయింగ్ కార్యకలాపాలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. పౌర విమానయాన జనరల్ అథారిటీతో సమన్వయంతో సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అనుమంతిచిన ప్రాంతాల్లో ఈ క్రీడల ప్రాక్టీస్ ను పరిమితం చేయకుండా దీన్ని దుర్వినియోగం చేయడం, నిషేధించబడిన ప్రాంతాల్లో డ్రోన్ లను ఎగురవేయడం వంటి వాటిని ఇటీవల గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అసురక్షిత పద్ధతుల నుండి సంరక్షించడానికి, ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి MOI, పౌర విమానయాన జనరల్ అథారిటీ కట్టుబడి ఉందన్నారు. అయితే, డ్రోన్లను ఉపయోగించి షూటింగ్ ఒప్పందాలు లేదా వాణిజ్య లేదా ప్రకటనల ప్రాజెక్ట్ ల కోసం అవసరమైన మినహాయింపులు, అనుమతులను తీసుకోవడానికి తప్పనిసరిగా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా కార్యకలాపాలను నిర్వహిస్తే, మార్గదర్శకాలను విస్మరిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని MOI స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







